3, జులై 2009, శుక్రవారం

మనిషి-వయసు


వ్వనం మనిషిని ఉత్తేజ పరుస్తుంది.వార్ధక్యం మనిషిన కుంగదీస్తుంది .ఇదిజనాభిప్రాయం.కాని, భేదం మనసుకి వుండదు ఉత్తేజ కరమయిన మనసు ఎప్పుడుఉత్సాహమ్గానే ఉంటుంది .అది వార్దక్యమ్యినా సరే.
యితే, రెండిటినీ ప్రభావితం చేసే మహమ్మారి ఒకటుంది .అదే అనారోగ్యం .భగవంతుడునూటికి తొంభై మందికి ఆరోగ్యవంతమయిన జన్మనే ప్రసాదిస్తాడు చిన్న తనం నించీ ఆరోగ్యాన్ని క్రమశిక్షణ కలిగిన జీవన విధానం ద్వారా కాపాడు కొన్నవాడు వార్దక్యములో కుడా ఉరకలేస్తూవుండగాలుగుతాడు .
కాని,యవ్వనంలో పట్టపగ్గాలు లేకుండా ,వావి వరుసలు లేకుండా ,ఆవు టేద్దుల వలె సంసరించిన వాళ్లు ,అడ్డమయినవ్యామోహాలకు, దుర్వ్యసనాలకు లోనయిన వాళ్లు ,ధూమపానం ,మద్యపానం ,విచ్చల విడితనమే తమ ఆదర్శంగాభావించే వాళ్లు , వార్దాక్యంలో అనుభవించే ఆరోగ్య పరమయిన కస్టాలు అన్నీ యిన్నీ కావు .అందుకు నేనొక రోల్మోడల్.యవ్వనంలో గడిపిన క్రమ శిక్షణా రహితమయిన జీవితానికి నా జీవితం నిలువుటద్దం .
యువకులార, మీ తరానికి చెప్పవలసిన పని లేకున్నా ,చెప్తున్నాను. మీజీవితాల్ని ఆరోగ్యవంతమయిన ఆలోచనలో తోక్రమ శిక్షణ కలిగిన నడవడిక తో తీర్చి దిద్దు కొండి ,ఉన్నత శిఖరాలను అందుకోండి